గొల్లపూడి మారుతీ రావు నటుడిగానే కాదు రచయితగాను మంచి పేరు ప్రఖ్యాతలు పొందారు. ఆయన రాసిన తొలి కథ ఆశాజీవి. రేనాడు అనే స్థానిక పత్రికలో డిసెంబర్ 9,1954న ఇది వెలువడింది. ఇక ఆయన చేసిన కొన్ని రచనలను భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు. తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు. గొల్లపూడి రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం. ఆయన రచనల మీద పరిశోధన చేసి, ఎం.ఫిల్, మరియు డాక్టరేట్లు సాధించిన వారు కూడా ఉన్నారు. చాలా సెమినార్లలో మారుతీరావు కీలకోపన్యాసకునిగా వ్యవహరించాడు. తెలుగు సాహిత్యం మీద ఆయన వ్రాసిన రెండు పరిశోధన పత్రాలు ఆంధ్రవిజ్ఞాన సర్వస్వం 11వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.
రచయితగాను పేరు ప్రఖ్యాతలు పొందిన గొల్లపూడి